ప్రతిభను గుర్తించేందుకే పరీక్షలు

ప్రతిభను గుర్తించేందుకే పరీక్షలు

ప్రతిభను గుర్తించేందుకే పరీక్షలు
ప్రతిభను గుర్తించేందుకే పరీక్షలు
మహాప్రస్థానం, శ్రీకాకుళం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్‌షిప్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కాకినాడ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కాకినాడ విద్యాసంస్థల ఆధ్యర్యంలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష వ్రాసిన విద్యార్థులకు “ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ 2026”  పేరున స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారని కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపిసి, సిఈసి, హెచ్ఈసి, డిప్లమా, ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ అర్హతలున్న విద్యార్ధులు కాకినాడ ఆదిత్య డిగ్రీ కలశాలలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్‌ బి.శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలకు 7997036663, 7997176661 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలని అభ్యర్ధులకు సూచించారు.