ఎంవీజీఆర్-పెన్నాంట్ టెక్నాలజీస్ మధ్య ఎంవోయూ
MVGR COLLEGE
మహాప్రస్థానం, విజయనగరం: పరిశ్రమ విద్యా సహకారాన్ని బలోపేతం చేసేందుకు, విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు ఎంవీజీఆర్ ఇంజినీ రింగ్ కళాశాల- పెన్నాంట్ టెక్నాల జీస్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. పెన్నాంట్ టెక్నాలజీస్ సీహెచ్ఎర్వో, కంప్లైన్స్ హెడ్ డి. రవివర్మ, కళాశాల డైరెక్టర్ పి. సీతారామరాజు పత్రాలను మార్చుకున్నారు. ఎంవోయూ వ్యూహాత్మక భాగస్వామ్య సహకారం పరిశోధన, విద్య, ఆవిష్కరణ, అభివృద్ధి, సామర్థ్యాల పెంపునకు దోహదం చేస్తుందన్నారు. పెన్నాంట్ టెక్నాలజీస్ నిత్యం సాంకేతిక సదస్సులు నిర్వహిస్తుందని, శిక్షణ, ఇంటర్న్ షిప్, రియల్టైమ్ ఎక్స్పోజర్స్ను అందిస్తుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వై. ఎం.సి. శేఖర్, ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ ఎం. సునీల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



kalyan@mahaprasthanam.info 
